Home > తెలంగాణ > లోక్సభ ఎన్నికలే టార్గెట్.. మరో కీలక నేతకు తెలంగాణ బీజేపీ బాధ్యతలు..

లోక్సభ ఎన్నికలే టార్గెట్.. మరో కీలక నేతకు తెలంగాణ బీజేపీ బాధ్యతలు..

లోక్సభ ఎన్నికలే టార్గెట్.. మరో కీలక నేతకు తెలంగాణ బీజేపీ బాధ్యతలు..
X

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో కనీసం 10 ఎంపీ సీట్లు లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ హైకమాండ్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్... ఆరేళ్లుగా రాజస్థాన్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతేడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాల వరకూ అన్నింటినీ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న ఆయనకు పార్టీ హైకమాండ్ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి చంద్రశేఖర్ ఆరేళ్లుగా రాజస్థాన్లో పనిచేస్తున్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాజస్థాన్ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు విన్నవించుకున్నారు. కొత్త బాధ్యతలు అప్పజెప్పాలని కోరారు. ఆయన కోరిక మేరకు రాజస్థాన్ నుంచి తప్పించి తెలంగాణ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ మూలాలున్న చంద్రశేఖర్ రాజస్థాన్ కన్నా ముందు సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంతో పాటు కాశీలో బీజేపీ బలోపేతం కోసం పనిచేశారు.

Updated : 15 Jan 2024 9:15 PM IST
Tags:    
Next Story
Share it
Top