కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బీజేపీ నుంచి పోటీ ఎవరంటే..
X
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోలింగ్ కు కేవలం 38 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో బిజీ అయ్యాయి. 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ మరో 4 స్థానాల్లో ఎవరిని బరిలో నిలుపనుందన్నది ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. పండగ తర్వాత రెండో జాబితా వెల్లడించే అవకాశముంది. ఇక బీజేపీ 52 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది.
బీజేపీ తొలి జాబితా విడుదల కావడంతో సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, హరీష్ రావుపై ఎవరిని బరిలో నిలిపిందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి బరిలోకి దింపింది. ఇక సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి వెంకట రమణా రెడ్డికి టికెట్ ఇచ్చింది.
మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బీజేపీ పార్టీ రాణి రుద్రమ రెడ్డిని బరిలో నిలిపింది. బీఆర్ఎస్ మరో కీలక నేత హరీష్ రావు సిద్ధిపేట నుంచి పోటీ చేస్తుండగా.. ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు.