జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ నాయకుల కీలక భేటీ
X
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ తెలంగాణ నేతలతో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక భేటీ జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ బీఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా నేత డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జావడేకర్ సమావేశంలో పాల్గొన్నారు.
అసెంబ్లీ బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాతో పాటు గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ వారం చివరికల్లా 60 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి జాబితాలో 20 మంది బీసీలకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సస్పెషన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.