Home > తెలంగాణ > KTR vs Raghunandan: నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే శంకరగిరి మాన్యాలకే..

KTR vs Raghunandan: నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే శంకరగిరి మాన్యాలకే..

KTR vs Raghunandan: నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే శంకరగిరి మాన్యాలకే..
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోయాక కేటీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మోదీ గురించి.. అధికారంలో నుంచి పోయిన తర్వాత గవర్నర్ గురించి నోటికి ఎంతస్తే అంత మాట్లాడుతున్నాడని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. సిరిసిల్ల ఖాళీ అవుతుంది నీకు కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. జెడ్పిటీసీలు, సర్పంచ్ లు, ఎంపిటీసీలు, నాయకులంతా రాజీనామా చేశారు.. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఢిల్లీలో ఎన్నడూ ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు చేసిన అన్యాయానికి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం నడిపిన శ్రీకాంత చారి తల్లికి ఫిబ్రవరిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ చిత్తశుద్ధిని చాటుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ ఒకటని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని చెప్పారు. కేటీఆర్ ఎన్ని అబాండాలు వేసినా, అసత్య ప్రచారాలు చేసినా కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు పార్టీలేనని ప్రజలకు తెలుసని అన్నారు. కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడకపోతే శంకరగిరి మాన్యాలకు పంపుతామని హెచ్చరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాక ఈ బేరసాలాలు ఇలాగే కొనసాగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందటానికని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వానిది మాటలు ఉన్నాయి.. కానీ చేతలు మాత్రం కనిపిస్తలేవని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై వెంటనే రియాక్షన్ తీసుకోవాలని చెప్పారు.. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ఇప్పటివరకు ఎవరిపై మీరు యాక్షన్ తీసుకోలేరని.. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరుపై 25 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని అంటున్నారు.. దానిమీద కేసు లేదు.. చర్యలు లేవు అని ఎద్దేవా చేశారు. హేటిరో సంస్థకు భూమిలిచ్చిన అంశంమీదా చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. మాజీ డీజీపీ, ప్రస్తుత టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అంశంలోనూ ఏదో చేస్తామని ఇంకేదో చేశారని సెటైర్లు వేశారు. సోమేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణితో రాష్ట్ర రైతుల జీవితాలు గందరగోళంగా మారాయి.. తాము అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని చెప్పారు.. ఇప్పటివరకు నోరు విప్పడం లేదని గుర్తుచేశారు.తెలంగాణలో పదేళ్లు జరిగిన అవినీతి ఆరోపనలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్వేతపత్రం ఇచ్చి.. అసెంబ్లీలో ఎవరు దోషులో చెప్పడానికి మీకు దైర్యం ఉందా.. లేదా.. అని నిలదీశారు.

Updated : 30 Jan 2024 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top