బీజేపీ రెండో జాబితా రిలీజ్.. ఒకే ఒక్క పేరుతో..
X
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 52మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కమలం పార్టీ.. తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఒకే ఒక్క స్థానంతో రెండో లిస్ట్ రిలీజ్ చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ స్థానానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. మిథున్.. జితేందర్ రెడ్డి తనయుడు. జితేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించగా.. ఆయన కొడుకు మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
మొదటి లిస్ట్లో బీజేపీ కీలక నేతలు పోటీ చేసే స్థానాలను బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ ఈ సారి రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. హుజూరాబాద్తో పాటు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఇక ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఎంపీ సోయం బాపూరావు బోధ్ నుంచి బరిలో దిగుతుండగా.. ధర్మపురి అర్వింద్ కోరుట్ల, బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు. గోషామహల్ నుంచి రాజాసింగ్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీకి దిగుతున్నారు.