Home > తెలంగాణ > గోషా మహల్ నుంచి ఔట్.. రాజాసింగ్ ప్లేస్లో యంగ్ లీడర్కు ఛాన్స్ ..?

గోషా మహల్ నుంచి ఔట్.. రాజాసింగ్ ప్లేస్లో యంగ్ లీడర్కు ఛాన్స్ ..?

గోషా మహల్ నుంచి ఔట్.. రాజాసింగ్ ప్లేస్లో యంగ్ లీడర్కు ఛాన్స్ ..?
X

తెలంగాణ బీజేపీలో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే నేతల మధ్య విబేధాలు పార్టీకి తలనొప్పిగా మారగా.. టికెట్ల కేటాయింపు అంశం సైతం హైకమాండ్ పెద్ద సవాల్గా మారనుంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ వార్త పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను అసెంబ్లీ బరి నుంచి తప్పించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయనను లోక్ సభకు పంపనున్నట్లు సమాచారం.

ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ ను అధిష్టానం ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అయితే గడువు పూర్తైనా ఇప్పటికీ సస్పెన్షన్ వేటు ఎత్తేయలేదు. ఇటీవలే రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీ మారనున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయిేత ఆ మరుసటి రోజే రాజాసింగ్‌ అలాంటిదేంలేదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఎంపీ టికెట్..!

మంత్రి హరీష్ రావును కలిసిన మరుసటి రోజే రాజాసింగ్ కు సంబంధించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పక్కనపెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందన్నది ఆ వార్త సారాంశం. గోషా మహల్ టికెట్ ను ఓ యువ నాయకుడికి ఇచ్చి రాజాసింగ్ ను జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దింపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజాసింగ్ మాత్రం ఈ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు తొలగించడంలో ఆలస్యమవుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హ్యాట్రిక్పై కన్ను

2014, 2018 ఎన్నికల్లో గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎంపీగా పోటీచేయాలని సూచించడంతో ఆయన దిక్కుతోచని పరిస్థితిలో పడ్డట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌ను జహీరాబాద్ నుంచి బరిలో నిలిపితే బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని అగ్రనాయకులు ధీమాతో ఉన్నారట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నుంచి ఎంపీగా పోటీకి దింపాలని హైకమాండ్ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

గోషా మహల్ నుంచి విక్రమ్ గౌడ్

గోషామహల్ సీటు నుంచి రాజాసింగ్‌ స్థానంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ను పోటీలో నిలపాలని బీజేపీ పెద్దల ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న విక్రమ్.. తానే బీజేపీ అభ్యర్థినని పలుమార్లు ప్రకటించుకున్నారు. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఇలా ప్రకటన చేశారనే వార్తలు వస్తున్నారు. అయితే రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్యేగా తప్ప.. ఎంపీగా పోటీచేసే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానే తప్ప గోషామహల్‌‌ను వదలనని తేల్చేసి చెప్పినట్లు తెలుస్తోంది.

Updated : 16 July 2023 11:46 AM IST
Tags:    
Next Story
Share it
Top