Home > తెలంగాణ > BJP High Command : హైకమాండ్ నుంచి పిలుపు.. హస్తినకు కిషన్ రెడ్డి

BJP High Command : హైకమాండ్ నుంచి పిలుపు.. హస్తినకు కిషన్ రెడ్డి

BJP High Command : హైకమాండ్ నుంచి పిలుపు.. హస్తినకు కిషన్ రెడ్డి
X

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తినకు బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపై చర్చించేందుకే అధిష్ఠానం ఆయనను పిలిచినట్లు తెలుస్తోంది. గురువారం ఆయన పార్టీ పెద్దలతో భేటీయై బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

అక్టోబర్ 15 బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ఆలోపు అభ్యర్థిత్వాలను ఫైనల్ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజునగానీ 16న గానీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశముంది. బీజేపీ తొలి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే తెలంగాణకు రెండుసార్లు వచ్చిన ప్రధాని మోడీ మహబూబ్ నగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం ప్రచారం మరింత జోరందుకోనుంది.

Updated : 11 Oct 2023 4:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top