Home > తెలంగాణ > యాక్టివ్ మోడ్లోకి బీజేపీ.. సర్కారును ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్

యాక్టివ్ మోడ్లోకి బీజేపీ.. సర్కారును ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్

యాక్టివ్ మోడ్లోకి బీజేపీ.. సర్కారును ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ యాక్టివ్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయగా.. కాంగ్రెస్ క్యాండిడేట్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం డీలాపడ్డ బీజేపీ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. వరుస ప్రోగ్రామ్స్ తో కేసీఆర్ సర్కారును టార్గెట్ చేస్తోంది. ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వరుస కార్యక్రమాలను సిద్ధం చేసింది.





కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జితావో నినాదంతో బీజేపీ ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో కమలదళం మంత్రుల ఘెరావ్, కలెక్టరేట్ ముట్టడి, ఛలో హైదరాబాద్ తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నిరనసల్లో భాగంగా గురువారం మంత్రుల ఘెరావ్ కార్యక్రమం చేపట్టనున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు.. శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నారు. వచ్చే నెల 7న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి కమలదళం పిలుపునిచ్చింది. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటం ఉద్ధృతం చేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

మరోవైపు బూత్ స్థాయి సమ్మేళనాలు నిర్వహిస్తున్న టీబీజేపీ ప్రజలతో మమేకమవుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ నియోజకవర్గ యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెలాఖరు నుంచి భద్రాచలం, బాసర, ఆలంపూర్‌ నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. దాదాపు 18 రోజులు పాటు కొనసాగనున్న ఈ యాత్రలో భాగంగా ఒక్కో రూట్‌లో 36 నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా ప్లాన్‌ చేశారు.

యాత్రలో భాగంగా బీజేపీ నేతల రోజు రెండు నియోజకవర్గాలు కవర్‌ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు ఈ యాత్రల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ముగింపు సభకు ముంచే అభ్యర్థులను ప్రకటించాలన్నది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.




Updated : 24 Aug 2023 5:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top