మణిపూర్ లో కుకీలు, మైతీల మధ్య వైరానికి కారణం బీజెపీనే-Revanth Reddy
X
పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ ఈ సభలోకి వస్తే వారికి గౌరవం ఉండేది. వారిపట్ల ఆయనకు చులకన భావం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతుల మధ్య విభజన అనే బ్రిటీషర్ల విధానాన్ని బిజెపి తీసుకు వస్తోందని ఆయన విమర్శించారు.
మణిపూర్ లో కుకీలు, మైతీల మధ్య వైరానికి బీజెపీనే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మణిపూర్ లో జరుగుతున్న మారణకాండకు ఆదివాసీలకు క్షమాపణ చెప్పి ఉంటే వారి గౌరవం మరింత పెరిగి ఉండేదికానీ ఆదివాసీలు, గిరిజనులపై ప్రధానికి చులకన...అందుకే ఈరోజు కూడా ప్రధాని సభలోకి రాలేదంటూ దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లుగా మోదీ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు.దాని కారణంగానే గొగోయ్ గారు ఇండియా కూటమి తరపున ఇచ్చిన అవిశ్వాసాన్ని సమర్దిస్తున్నా అంటూ తాను ఎటువైపు ఉన్నదీ తెలిపారు.
ప్రధాని మోదీ ఆయన మంత్రి మండలిపై ప్రజలకు విశ్వాసం పోయింది.అందుకే 140 కోట్ల దేశ ప్రజల తరపున ప్రధాని వైదొలగాలని అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి. మణిపూర్ లో జాతుల మధ్య వైరంతో అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజించు పాలించు విధానాన్ని కాంగ్రెస్, ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.మణిపూర్ మండిపోతుంటే, అక్కడ రక్తం ఏరులై పారుతుంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. మణిపూర్ కి వెళ్ళి అక్కడి ప్రజలను రక్షించాల్సింది పోయి ఓట్ల వేట కోసం కర్ణాటకకు వెళ్ళారు అంటూ విమర్శించారు.బీజేపీకి ప్రజల మాన,ప్రాణాలకంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం
అంటూ దుయ్యబట్టారు.
ఎన్డీఏ అంటే నేషన్ డివైడ్ అలియన్స్ అనే కొత్త అర్ధాన్ని నిరూపిస్తోంది నేటి బీజెపీ ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి.
మోదీ నినాదం వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ ట్యాక్స్ కాదు....ఆయనకు కావల్సింది వన్ నేషన్ వన్ పర్సన్.సభకు వచ్చి మణిపూర్ ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ప్రధాని మోదీని స్పీకర్ ఆదేశించాలని కోరారు రేవంత్.