Home > తెలంగాణ > వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ..?

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ..?

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ..?
X

మరో నాలుగైదు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సంబదించిన కసరత్తులు మొదలుపెట్టాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇటీవల బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబధించి దిశానిర్దేశం చేశారు. కాగా రాష్ట్రంలో మాదిగల ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను.. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. ఆయనకు టికెట్ ఇస్తే.. మాదిగల ఓటు బ్యాంకును దక్కించుకోవచ్చని అధిష్టానం భావిస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజెపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజెపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి వరంగల్ బీజేపీ టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.




Updated : 30 Dec 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top