2 లక్షల ఉద్యోగాలిస్తం, సెప్టెంబర్ 17ను అధికారికం చేస్తాం.. అమిత్ షా
X
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజమెత్తారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు మేలు చేసింది బీజేపీనే అని అన్నారు. ఆయన శనివారం వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ ‘సకల జనుల విజయ సంకల్ప సభ’లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా గుర్తించి వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. ప్రధాని నరేంద్ర మదీ ఓబీసీలకు అన్ని రంగాలల్లో సముచిత స్థానం ఇచ్చారని అమిత్ షా ప్రశసించారు. దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నెరవేర్చలేదని మండిపడ్డాడరు. తాము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లలో 25 శాతం బీసీలకు కేటాయిస్తామన్నారను.
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాటు చేశారు. కాళేళ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పేరు చెప్పి అవినీతికి పాల్పడ్డారు. మియాపూర్‌లో భారీ భూకుంకోణం జరిగింది. స్మార్ట్ సిటీ పథకం మేం తెలంగాణకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్లు లీక్ చేసి యువతీయువకుల జీవితాలతో ఆడుకున్నారు ’’ అని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకమని, వారికి బీజేపీతోనే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణ భారతదేశంలో భాగమైన సెప్టెంబర్ 17వ తేదీని కేసీఆర్ ఒవైసీకి భయపడి విమోచన వేడుకలు జరపలేదని, తాము అధికారంలోకి వస్తే ఘనగా నిర్వహిస్తామని అన్నారు.