Home > తెలంగాణ > బండి సంజయ్‌కి క్లాస్ పీకిన అమిత్ షా!

బండి సంజయ్‌కి క్లాస్ పీకిన అమిత్ షా!

బండి సంజయ్‌కి క్లాస్ పీకిన అమిత్ షా!
X

‘‘ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి, ఢిల్లీ పెద్దలకు చాడీలు చెప్పకండి’’ అంటూ కలకలం రేపిన తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని కోల్పోయాక అమిత్ షాను కలవడం ఇదే తొలిసారి. ఇద్దరూ తెలంగాణకు సంబంధించిన అంశాలతోపాటు అంతర్గత సమస్యలపై విభేదాలపై చర్చించుకున్ననట్లు తెలుస్తోంది. లోపలి విషయాలను మీడియా ముందు మాట్లాడడం సరికాదని అమిత్ షా బండిని మందలించినట్లు సమాచారం. దీనికి బండి స్పందిస్తూ.. తనతోపాటు కొందరు బాగా పనిచేసే నేతలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని వాపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని అమిత్ షా సూచించినట్లు పార్టీ శ్రేణుల చెబుతున్నాయి. కాగా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని బండి కోరారు.

బండిని కలిసిన విషయాన్ని అమిత్ షా ట్విటర్లో వెల్లడించారు. తెలంగాణ అంశాలపై చర్చించుకున్నామని ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. అమిత్ షాను కలిసినందుకు సంతోషంగా ఉందని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని గెలిపించడానికి కృషి చేస్తానని చెప్పారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరించిన కార్యక్రమంలో బండి సంచలన వ్యాఖ్యలు చేయడం తెలసిందే. ‘‘కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు మానండి. నాపై చాడీలు చెప్పారు. పార్టీకి ఇది మంచిది కాదు’’ అని అన్నారు. దీంతో అధిష్టానం ఆయనను మందలించింది. ఇలా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామని, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ భన్సల్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Updated : 24 July 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top