వచ్చే ఎన్నికల్లో పోటీపై బాబు మోహన్ సంచలన ప్రకటన..
X
బీజేపీ నేత బాబు మోహన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటా చేయనని ప్రకటించారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్లో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. ఈ అంశంపై పార్టీ ప్రెసిడెంట్కు ఫోన్ చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. పార్టీ పెద్దలు తన ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. ఉరితీసే వారికి కూడా చివరి అవకాశం ఇస్తారని.. కానీ తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది కావాలనే తండ్రి కొడుకుల మధ్య పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు మోహన్ మండిపడ్డారు. అటువంటి అసత్యాలను జనాలు నమ్మొద్దన్నారు. బీజేపీ నేతలు బతిమిలాడితేనే ఆ పార్టీలోకి వెళ్లినట్లు చెప్పారు. తనకు రాజకీయాలు తిండి పెట్టలేవని.. సినిమాల ద్వారా కష్టపడి సంపాదించుకున్నానన్నారు. త్వరలో పార్టీ పెద్దలను కలిసిన తర్వాత పార్టీలో ఉండాలా..ఒద్దా అనేది తేల్చుకుంటానని స్పష్టం చేశారు.