డీకే అరుణ కూతురికి డ్రైవర్ 11 లక్షల టోపీ
X
డబ్బు చూస్తేనే కాదు, కార్డులను చూసినా ఆశపుడుతోంది. క్రెడిట్ కార్డులు కూడా దొంగలకు కనకవర్షం కురిపస్తున్నాయి. ఎలాగోలా మాంచి లిమిట్ ఉన్న కార్డ్ సంపాదించి, పిన్ పట్టేస్తే డబ్బులే డబ్బులు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంట్లోనూ అలాంటి దొంగ బండారం బయటపడింది. అరుణ కూతురు శ్రుతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును ఆమె సొంత డ్రైవరే దొంగిలించి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. అంత సొమ్ము లాగడానికి ఓటీపీలను ఎలా మేనేజ్ చేశాడో తెలియక పోలీసులు కూడా తల పట్టుకుంటున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్‌పర్వత్ విల్లాస్‌లో నివసిస్తున్న శ్రుతి రెడ్డి దగ్గర చిన్నా అలియాస్ బీసన్న ఆరునెలలుగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమె వాడుతున్న హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును కొట్టేసిన చిన్నా శ్రీమహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో కార్డు వాడి రూ. 11 లక్షల నగలు కొన్నాడు. విషయం తెలుసుకున్న శ్రుతి రెడ్డి తన కార్డుపై ఎవరు కొన్నారో ఆరా తీసింది. చిన్నాను ప్రశ్నించగా తనకేం తెలియదని బుకాయించాడు. గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. శ్రుతి రెడ్డి అతనిప బంజాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.