Home > తెలంగాణ > బండి సంజయ్‌ను చూసి బాత్రూంలో ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి

బండి సంజయ్‌ను చూసి బాత్రూంలో ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి

బండి సంజయ్‌ను చూసి బాత్రూంలో ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి
X

తెలగాణలో బీజేపీకి బండి సంజయ్ ఊపు తెచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సమయంలో.. ఆయనను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. వెంటనే బాత్రూంకి వెళ్లి ఏడ్చానని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ సత్తా చాటిందని గుర్తుచేశారు. బండి సంజయ్ విషయంలో తనకు బాధ కలిగిందన్నారు. బండి సంజయ్‌ని అధిష్టానం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో.. బండి సంజయ్‌పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి బీజేపీని విజయపథంలో నడిపిస్తామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్, కవితను జైలుకు బీజేపీ పంపిస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఢిల్లికి వెళ్లి ఈడీ అధికారుల‌ను మానేజ్ చేసారని..అందుకు క‌విత బ‌య‌ట ఉందని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.


Updated : 21 July 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top