Home > తెలంగాణ > కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న కడియం.. సంబంధం లేదన్న బీజేపీ

కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న కడియం.. సంబంధం లేదన్న బీజేపీ

కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న కడియం.. సంబంధం లేదన్న బీజేపీ
X

తెలంగాణలో ఏడాది తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. కడియం శ్రీహరి మాటలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ఎంఐఎంతో అంటకాగే ఏ పార్టీకి బీజేపీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. రేవంత్ టీడీపీ మిత్రుడు కాబట్టి.. కడియం శ్రీహరి కాంగ్రెస్లో మంత్రిగా చేరితే చేరొచ్చని విమర్శించారు. ఇటువంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రఘునందన్ కార్యకర్తలను కోరారు.

ఇటీవల కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి 39 సీట్లు ఉన్నాయని.. మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 8 ఉన్నాయని అన్నారు. మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. అయితే ఎంఐఎంతో పొత్తులో ఉన్న పార్టీకి మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదని రఘునందన్ రావు తేల్చి చెప్పారు.

Updated : 9 Dec 2023 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top