Home > తెలంగాణ > అక్కడ బీజేపీ.. ఇక్కడ కాంగ్రెస్.. బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలి : Raghunandan Rao

అక్కడ బీజేపీ.. ఇక్కడ కాంగ్రెస్.. బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలి : Raghunandan Rao

అక్కడ బీజేపీ.. ఇక్కడ కాంగ్రెస్.. బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలి : Raghunandan Rao
X

బీఆర్ఎస్లో డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్ ఇస్తారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అందులో టికెట్ దక్కదని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. మిగితా పార్టీలన్నీ కలిసి వచ్చినా బీజేపీని ఎదుర్కోలేరని వ్యాఖ్యానించారు. మెదక్లో బీజేపీ ఉందో లేదో హరీష్ రావుకు ఎంపీ ఎన్నికల్లో తెలుస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి చెందడం ఖాయమని.. కేసీఆర్ కుటుంబానికి షాకిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

కేసీఆర్ను కేటీఆర్ పులి అని అంటున్నారని.. కానీ ఆయన ఎలుక అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గతంలో మోదీ వస్తే కేసీఆర్ ఎన్నోసార్లు ముఖం చాటేశారని.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి మోదీని కలిసినట్లు గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలని రఘునందన్ రావు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. బీఆర్ఎస్కు ఓటేసి ఏం లాభమని అడిగారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసిలో వేసినట్లేనని అన్నారు.

Updated : 20 Jan 2024 4:47 PM IST
Tags:    
Next Story
Share it
Top