BJP Leader Kidnap : హైదరాబాద్లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం
X
హైదరాబాద్ లో ఓ రాజకీయ నాయకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి శరణ్ బయలుదేరారు. అదే సమయంలో ఆయన కారులోకి కొందరు బలవంతంగా ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.
శరణ్ ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఆయన గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. డ్రైవర్ ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. శరణ్ చౌదరి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా వీడియోల ఆధారంగా కేసు విచారణ జరుపుతున్నారు. వీలైనంత తొందరగా ఆయన ఆచూకీ కనుక్కుంటామని అంటున్నారు.
bjp leader sharan chowdary kidnapped in hyderabad
telangana,hyderabad,kukatpally,sharan chowdary,kidnap,car,mobile switchoff,driver mobile,police complaint,cc camera footage,police enquiry,bjp leader