ఒక పార్టీ కోసమే పనిచేయగలం.. హాట్ టాపిక్గా మారిన విజయశాంతి ట్వీట్..
X
తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పార్టీ మారే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ విధానాలను విశ్వసించే హిందుత్వవాదిగా బీజేపీ వైపే నిలబడాలని మరికొందరు కోరుకుంటున్నారని విజయశాంతి ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ రెండు అభిప్రాయాలు కూడా కేసీఆర్ దుర్మాగపు పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే అని చెప్పారు. అయితే సినిమాల్లోలాగా ద్విపాత్రాభినయం చేయడం రాజకీయాల్లో సాధ్యపడదని అన్నారు. ఏదైనా ఒక పార్టీ కోసం మాత్రమే పనిచేయగలమని విజయశాంతి ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుండి పోరాడాలి...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 1, 2023
7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు..
బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం… pic.twitter.com/7S9GdxV6d4