రాజాసింగ్ సస్పెన్షన్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..ట్వీట్ వైరల్
X
తెలంగాణ బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్థానిక నాయకుల మధ్య విభేదాలు నెలకొనడంతో తాజాగా అధిష్టానం రంగంలోకి దిగి బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజాసింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయశాంతి తన ట్విటర్ అకౌంట్లో రాజాసింగ్ సస్పెన్షన్‌పై కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి. "ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్‌తో సహా రాష్ట్ర పార్టీ అంతా కూడా ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే విధంగా నిర్ణయం ఉంటుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు కలిగిన బీజేపీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా. సరైన టైంలో అంతా మంచే జరుగుతుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం అందరికీ మంచిగానే వస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. "అని విజయశాంతి ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.