Home > తెలంగాణ > కాంగ్రెస్లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్..?

కాంగ్రెస్లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్..?

కాంగ్రెస్లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్..?
X

తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి పార్టీ మారుతారని గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటిముట్టన్నట్లు ఉంటున్నారు. బీజేపీ రెండు జాబితాల్లోనూ ఆమె పేరు లేదు. అయితే పార్టీ తీరుపై పలుసార్లు ఆమె బహిరంగ విమర్శలు సైతం చేసింది. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు సైతం పార్టీ మారుతారనేదానికి బలం చేకూరుస్తున్నాయి.

బీఆర్ఎస్పై కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు.. బీజేపీలోనే ఉండాలని మరింకొందరు కోరుతున్నారని.. కానీ తాను ఒక పార్టీ కోసం మాత్రమే పనిచేయగలని ఇటీవల విజయశాంతి ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ సైతం ఆమెను సొంతగూటికి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలో విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని.. శనివారం ఆమె హస్తం కండువా కప్పుకుంటారని విశ్వసనీయం సమాచారం.

Updated : 3 Nov 2023 10:57 PM IST
Tags:    
Next Story
Share it
Top