Home > తెలంగాణ > ఎమ్మెల్సీ కవితపై రాములమ్మ సానుభూతి!

ఎమ్మెల్సీ కవితపై రాములమ్మ సానుభూతి!

ఎమ్మెల్సీ కవితపై రాములమ్మ సానుభూతి!
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఆమె ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌‎ను షేర్ చేశారు. ఈ కుంభకోణం కేసులో తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ గురువారం మరోసారి నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవితపై విజశాంతి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుంతోంది.

" ఒక ఆడబిడ్డకు ఇంత కష్టం రావొద్దు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే నిలవాలని వ్యక్తిగతంగా కోరుకుంటాను. అయితే ఇది కక్ష సాధింపు చర్య మాత్రం కానే కాదు. రాజకీయపరంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సినంత అవసరం బీజేపీకి లేదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ పని చేసుకుంటూ పోతాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత అరెస్ట్ కాకపోతే, బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ... బీజేపీకి ఆ భయం ఉండదు" అని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పందించారు.

Updated : 15 Sept 2023 11:12 AM IST
Tags:    
Next Story
Share it
Top