మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విజయశాంతి విమర్శలు..
X
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ చీఫ్ బండి సంజయ్ నుండి బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. పార్టీ నేతల సమక్షంలో అధ్యక్షుడిగా రిజిష్టర్‌లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కిరణ కుమార్ రెడ్డి హాజరుకావడంపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి విమర్శలు గుప్పించారు.
కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. " నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వారు స్టేజిపై ఉన్నారు. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనిప్రయత్నించిన వారూ అక్కడ ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకిలు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యా. అందుకే కార్యక్రమం ముగియకముందే వెల్లిపోవాల్సి వచ్చింది" అని విజయశాంతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 21, 2023
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని… pic.twitter.com/l22P9lvyxm
ఇదే కార్యక్రమంలో బండి సంజయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసంతృప్త నేతలపై మండిపడ్డారు. ఇకనైనా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్న సంజయ్.. కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండని కామెంట్ చేశారు.