Home > తెలంగాణ > పార్టీ మార్పుపై వివేక్ వెంకటస్వామి క్లారిటీ

పార్టీ మార్పుపై వివేక్ వెంకటస్వామి క్లారిటీ

పార్టీ మార్పుపై వివేక్ వెంకటస్వామి క్లారిటీ
X

తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతోంది. నేతల జంపింగ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో మరో బీజేపీ నేత వివేక్ వెంటకస్వామి పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను వివేక్ కొట్టిపారేశారు. అవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు.పెద్దపల్లి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తానన్నారు. కాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదన్నారు.


Updated : 25 Oct 2023 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top