Home > తెలంగాణ > ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ నేతల దాడి

ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ నేతల దాడి

ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ నేతల దాడి
X

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి చేశారు. శుక్రవారం రాత్రి రజూరా గ్రామంలో పర్యటించిన ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్ వినాయక మండపాలను సందర్శించారు. అదే సమయంలో అటుగా వచ్చిన బీజేపీ మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్ తన అనుచరులతో కలిసి జాన్సన్ నాయక్ కారు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

స్థానిక బీఆర్ఎస్ నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. గడ్డం రవీందర్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న బీజేపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. స్టేషన్ కిటికీలు, తలుపులు విరగ్గొట్టారు. గడ్డం రవీందర్ను పోలీసులు విడిచిపెట్టడంతో గొడవ సద్దుమణిగింది.

Updated : 23 Sept 2023 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top