Home > తెలంగాణ > ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం కావడం ఖాయం - బండి సంజయ్

ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం కావడం ఖాయం - బండి సంజయ్

ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం కావడం ఖాయం - బండి సంజయ్
X

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని మరో భైంసాలా తయారు చేస్తారని మండిపడ్డారు. బైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఎంతో మంది బలిదానాలు, సుష్మా స్వరాజ్ ఒత్తిడి వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు.

రాష్ట్రంలో ప్రతి పార్టీ అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నాయే తప్ప తెలంగాణకు ఉన్న అప్పులు ఎలా తీరుస్తామని చెప్పడం లేదని బండి అన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒక్క 1.20లక్షల అప్పు ఉందని, రాష్ట్రాన్ని ఆ అప్పుల కుప్పల నుంచి బయటపడేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్లో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ గెలిచాక ముధోల్ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముధోల్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులను సైతం తీసుకొస్తానని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసిన ఘనత బీజేపీతో సొంతమని బండి సంజయ్ స్పష్టం చేశారు.


Updated : 18 Nov 2023 11:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top