కమలం పార్టీలో గుబులు.. ఈటలకు కేంద్ర మంత్రి పదవి.. అందుకేనా..?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా వేల రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్నీ.. ఆఫర్లు చూపెడుతూ ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్సెస్, బీఆర్ఎస్ పార్టీలు జోరు పెంచుతుంటే.. కమలం పార్టీ మాత్రం ఇంకా సన్నద్దం అయినట్లు కనిపించట్లేదు. పార్టీ నాయకుల మధ్య విభేదాలను సర్దుమనిగించడం కోసం.. అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. నేతలతో చర్చలు జరిపి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదివి నుంచి తప్పించాలని.. రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. లేదంటే చాలామంది నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరుతున్నారనే పుకార్లు వస్తున్నాయి.
బీజేపీలో జరుగుతున్న పరిణామల దృష్యా ఆ వార్త నిజమేనని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వాళ్లను వదులుకునే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. అందుకుగానూ.. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసే ఆలోచనలో ఉంది. బండి సంజయ్ ని బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అంతేకాదు ఈటలను కాంగ్రెస్ లో చేరకుండా ఆపేందుకు బీజేపీ నాయకులు పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈటలకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈటలకు వై కేటగిరీ భద్రతను కేటాయించేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ కూడా రాష్ట్రంలో జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.