Mla Maheshwar Reddy : నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే.. తెలంగాణ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ..
X
తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య మాటలు తూటాలు పేలాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 1న ప్రత్యేక భేటీ అయ్యారని మాట జారారు. కిరణ్ కుమార్ రెడ్డి పేరు పలకడంతో సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సీఎ రేవంత్ రెడ్డి ఆయన అంటూ కవర్ చేశారు. కాగా కేఆర్ఎంబీకీ ప్రాజెక్టులను ఎందుకు అప్పగించకూడదో బీఆర్ఎస్-కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ తీరుతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు.
కేసీఆర్ తెలంగాణకు నష్టం చేశారని మహేష్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులు కడుతున్నా బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కృష్ణ జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు. మొత్తం 512 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకపోతోందని ఆరోపించారు. ఏపీ నీటి దోపడిని కేసీఆర్ పట్టించుకోకపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఏపీ సర్కార్ 8 టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కొత్త ట్రిబ్యునల్ కోసం కోర్టులో కేసు వేసి ఏడేళ్లు జాప్యం చేశారని.. 2022లో దానిని ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.