సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వయి, కార్పొరేటర్
X
బీజేపీ ఎమ్మెల్యే పాల్వయి హరీశ్ బాబు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నిల్లో హరీశ్ ఇటీవల సిర్పూర్-కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఆయన సీఎం రేవంత్‌తో భేటి కావడం రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారింది. మన్సురాబాద్ కార్పొటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా సీఎంతో కలిశారు. కాగా కొద్ది రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటి కవడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఒక వైపు భారతీయ జనతా పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయన ఎందుకు సీఎంను కలుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను కలిశారు. ఈ నేపథ్యంలో వీరు పార్టీ మారుతున్నారా.. లేక వారి ప్రాంత అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కలిశారా..అన్న విషయం ఆసక్తికరంగా మారింది.