Home > తెలంగాణ > సరదాగా మాట్లాడితే తప్పుగా అర్ధం చేసుకున్నారు : రఘునందన్

సరదాగా మాట్లాడితే తప్పుగా అర్ధం చేసుకున్నారు : రఘునందన్

సరదాగా మాట్లాడితే తప్పుగా అర్ధం చేసుకున్నారు : రఘునందన్
X

తాను పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. పార్టీ నాయకత్వాన్ని తాను ధిక్కరించేవాడిని కాదన్నారు. పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటానని.. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

సరదాగా మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని రఘునందన్ రావు అన్నారు. ‘‘నేను తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని. ఢిల్లీలో అసలు ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. నాకు కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదు. నేను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దుబ్బాక నియోజకవర్గానికి నిధులు కోసం కిషన్ రెడ్డిని కలిశాను ’’ రఘునందన్ అన్నారు.

అంతకుముందు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్కు 100 కోట్ల యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. దుబ్బాకలో తనను చూసే ప్రజలు గెలిపించారని.. తనకెవరూ సాయం చేయలేదన్నారు. మునుగోడులో భారీగా డబ్బు ఖర్చుపెట్టిన బీజేపీ గెలవలేదన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. తనకు పార్టీ అధక్ష్య పదవి, ఫ్లోర్ లీడర్, జాతీయ అధికార ప్రతినిధి పోస్టులలో ఏదైనా ఒకటి ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

Updated : 3 July 2023 9:32 PM IST
Tags:    
Next Story
Share it
Top