బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు నిజమే : రఘునందన్ రావు
X
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మార్పుపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమన్నారు. పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్కు 100 కోట్ల యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. తన గెలుపు చూసే ఈటల పార్టీలోకి వచ్చారని చెప్పారు. దుబ్బాకలో తనను చూసే ప్రజలు గెలిపించారని.. తనకెవరూ సాయం చేయలేదన్నారు. మునుగోడులో భారీగా డబ్బు ఖర్చుపెట్టిన బీజేపీ గెలవలేదన్నారు.
పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. తనకు పార్టీ అధక్ష్య పదవి, ఫ్లోర్ లీడర్, జాతీయ అధికార ప్రతినిధి పోస్టులలో ఏదైనా ఒకటి ఇవ్వాలన్నారు. పార్టీకి అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత లేడనే విషయం నడ్డాకు తెలియదని చెప్పారు. ఓట్లేసేది తరుణ్ చుగ్ను చూసి కాదని.. ఈటల, తన బొమ్మలుంటేనే ఓట్లు పడతాయన్నారు. పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం దేవర కరుణాకర్ అడిగి అడిగి చనిపోయారని చెప్పారు.
‘‘నేను పెద్ద పదవులకు అర్హుడిని కానా? పార్టీ అభివృద్ధి కోసం పదేళ్లుగా ఎంతో కష్టపడి చేస్తున్నా. నా కులం కొన్ని విషయాల్లో మైనస్ పాయింటు కావొచ్చు. వచ్చే రెండు నెలల్లో రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోతుంది. నేను దుబ్బాక నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా. గత ఎన్నికల్లో నాకెవరూ సాయం చేయలేదు. నన్ను చూసే జనం గెలిపించారు. నేను బీజేపీ నుంచ వెళ్లిపోను. మునుగోడు బై ఎలక్షన్లో గెలవడానికి వందల కోట్లు ఖర్చుపెట్టినా గెలవలేదు. నా బొమ్మతో, ఈటల బొమ్మలతోనే ఓట్లు పడతాయి. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదు. తనా సేవలకు గతిన ప్రతిఫలం రాకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తాను’’ అని రఘునందన్ హెచ్చరించారు.