మంత్రి హరీష్ రావుని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మార్పు?
X
తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోపక్క, ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా చెపుతున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజాసింగ్ పార్టీ మారబోతున్నారంటూ వార్తలు రావడంతో ఆయన స్పందించారు. తాను తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో భేటీ అయ్యానని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే మంత్రికి కలిశానని తెలిపారు. హరీష్ రావును కలిసిన తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగిందని, దీంట్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణం గురించి హరీష్ రావుతో చర్చించానని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా.. ఎత్తివేయకపోయినా తాను బీజేపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Goshamahal MLA @TigerRajaSingh meets Finance Minister @BRSHarish at the latter’s residence pic.twitter.com/tsGlLd3q0A
— Saye Sekhar Angara (@sayesekhar) July 14, 2023