Home > తెలంగాణ > బాల్కొండ ప్రజలు ఆలోచించి ఓటు వేయండి - ఎంపీ అర్వింద్

బాల్కొండ ప్రజలు ఆలోచించి ఓటు వేయండి - ఎంపీ అర్వింద్

బాల్కొండ ప్రజలు ఆలోచించి ఓటు వేయండి - ఎంపీ అర్వింద్
X

బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఎవరు ఎమ్మెల్యే కావాలో పక్కాగా ఆలోచించి ఓటు వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. బాల్కొండ బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మకు మద్దతుగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. యాడాదికో పార్టీ మార్చేవాళ్లు కావాలో హుందాగా ఉంటూ పేరుకు తగ్గట్లు అందరికీ అన్నం పెట్టి తల్లిలా లాలించే అన్నపూర్ణమ్మ కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సునీల్ కుమార్ రెడ్డితో ఢీకొంటున్నామని చెప్పారు.

రైతులు తమ కోసం పనిచేసిన వారికి పట్టం కట్టి గెలిపించాలని అర్వింద్ కోరారు. తాము అధికారంలోకి వస్తే రానున్న కాలంలో రైతన్నలకు మరింత అండగా నిలుస్తామని చెప్పారు. గతంలో ఎందరో ఎన్నో వాగ్దానాలు చేసి మర్చిపోయినా.. బీజేపీ మాత్రం మాట నిలబెట్టుకుందని అన్నారు. దేశంలో అత్యధికంగా 1.5 లక్షల హెక్టార్లలో పసుపు సాగువుతోందని, దాంట్లో ఎక్కువ మొత్తం బాల్కొండలోనే సాగు అవుతోందని అర్వింద్ చెప్పారు. పసుపు రైతులపై ప్రేమతో ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, దీనితో చాలా ఉపయోగాలు ఉంటాయని అవేంటో రానున్న రోజుల్లో మీకే తెలుస్తుందని అన్నారు.

జాతీయ పసుపు బోర్డు ద్వారా భవిష్యత్తులో రైతులకు మద్దతు ధరతో పాటు, ఉద్యోగాలు వస్తాయని అర్వింద్ చెప్పారు. అంతేకాక ఇండస్ట్రీలు ఏర్పాటు అవడంతో పాటు పసుపు పంటకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాల్కొండలో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత రైతన్నలందరూ తీసుకోవాలని కోరారు.

Updated : 12 Nov 2023 12:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top