Home > తెలంగాణ > కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ.. పార్లమెంట్లో చెలరేగిన బండి

కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ.. పార్లమెంట్లో చెలరేగిన బండి

కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ.. పార్లమెంట్లో చెలరేగిన బండి
X

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో ఆ మూడు పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌కు తెలిసింది రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని సెటైర్ వేశారు. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆస్తులు 400 రెట్లు, ఆయన సతీమణి ఆస్తులు 1800రెట్లు పెరిగాయన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని.. దోచుకోవడం, దాచుకోవడమే బీఆర్ఎస్ పనిగా మారిందన్నారు.

మోదీ మణిపూర్ పోలేదని బీఆర్ఎస్ అంటుందని.. కానీ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ వెళ్లారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయం మీద ఆదాయం కోటి.. కేటీఆర్ వ్యవసాయ ఆదాయం 59 లక్షలు అని ఆరోపించారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగలేదు కానీ కేసీఆర్ కుటుంబం ఆస్తి మాత్రం పెరిగిందని విమర్శించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెప్తుందని.. ఒకవేళ 24 గంటల కరెంట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. లేకపోతే బీఆర్ఎస్ ఎంపీలు చేస్తారా అని సవాల్ విసిరారు.

రాహుల్.. ఓ గజినీ..

అసలు అవిశ్వాసం ఎందుకు పెట్టారో విపక్షాలకు క్లారిటీ లేదని సంజయ్ అన్నారు. ఏ కాంగీ, బెంగాల్‌ కా దీదీ, ఢిల్లీ కా కేజీ, బిహార్‌ కా జేడీ, తెలంగాణ కా కేడీలతో ఏమీ కాదని విమర్శించారు.

రాహుల్ తీరు చూసి ప్రపంచమంతా నవ్వుతుందని.. ఓ సారి కౌగిలించుకుంటారు మరోసారి కన్నుగొడతారు అని సెటైర్ వేశారు. ఆయనను చేస్తే గజిని గుర్తుకొస్తున్నాడని అన్నారు. భరతమాతను హత్య చేయడం కాదు.. కన్నెత్తి చూసి కళ్లు పీకి బొందపెట్టే ప్రధాని మోదీ ఇక్కడ ఉన్నారని అన్నారు.

Updated : 10 Aug 2023 6:36 PM IST
Tags:    
Next Story
Share it
Top