Home > తెలంగాణ > పొత్తు పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టిండు - Bandi sanjay

పొత్తు పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టిండు - Bandi sanjay

పొత్తు పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టిండు - Bandi sanjay
X

బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని మరోసారి కుండబద్దలు కొట్టారు. మీడియాతో చిట్ చాట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూస్తున్నందుకే కేసీఆర్ బీజేపీతో పొత్తు పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని బండి మండిపడ్డారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లు క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు తొలగిస్తే హైదరాబాద్ ఎంపీ సీటును సైతం తామే గెలుస్తామని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నుంచి షిండేలు వస్తారన్న బండి సంజయ్ అన్నారు.

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని బండి ప్రశ్నించారు. కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూసిన తర్వాతే సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ సభ్యులు రిపోర్ట్ ఇచ్చిందని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదని అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారని నిలదీశారు. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతుంటే... బీఆర్‌ఎస్‌ కేఆర్‌ఎంబీపై మాట్లాడుతోందని బండి విమర్శించారు.

Updated : 16 Feb 2024 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top