Bandi Sanjay vs KCR : కేసీఆర్ నిమ్మకాయ ఇస్తే తీసుకోకండి.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
X
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నాయకులు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్పై బండి సంజయ్ షాకింగ్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తన మాట వినని నాయకులను నాశనం చేసేందుకు ఆ పూజలు చేయిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యేలకు నిమ్మకాయలు ఇస్తున్నారని.. ఆయనిచ్చే నిమ్మకాయలు తీసుకోవద్దని బండి సంజయ్ సూచించారు. కేసీఆర్తో చెయ్యి కలిపితే జీవితాలు నాశనం అవుతాయని.. ఎమ్మెల్యే పదవి కంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ముఖ్యమని చెప్పారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ కుటుంబం ఆరితేరిందని విమర్శించారు. తాంత్రిక పూజలే కాకుండా డబ్బులతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. ఆ పార్టీలో కులాల కొట్లాటను కేసీఆరే పెట్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ లో ఎవరు గెలిచిన చివరకు కేసీఆర్ దగ్గరకే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసీఆర్ను యువత క్షమించదని అన్నారు. కేసీఆర్ ఎన్ని పూజలు చేసినా తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని సంజయ్ చెప్పారు.