Home > తెలంగాణ > ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ.. 52 మంది అభ్యర్థుల ప్రకటన

ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ.. 52 మంది అభ్యర్థుల ప్రకటన

ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ.. 52 మంది అభ్యర్థుల ప్రకటన
X

బీజేపీ పార్టీ సస్పెన్స్కు తెరదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ఎట్టకేలకూ అనౌన్స్ చేసింది. 52 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. ఈటల రాజేందర్ ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. హుజూరాబాద్తో పాటు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఇక పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఎంపీ సోయం బాపూరావు బోధ్ నుంచి బరిలో దిగుతుండగా.. ధర్మపురి అర్వింద్ కోరుట్ల, బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ ఫస్ట్ లిస్టులోనే ఆయనకు అవకాశమిచ్చింది. గోషా మహల్ టికెట్ ను రాజా సింగ్ కు కేటాయించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి బరిలోకి దిగనున్నారు.

బరిలో దిగే అభ్యర్థులు వీరే ..

1. సిర్పూర్ - డా.పాల్వ హరీష్ బాబు

2. బెల్లంపల్లి (ఎస్సీ) - శ్రీమతి అమరాజుల శ్రీదేవి

3. ఖానాపూర్(ఎస్టీ) - రమేష్ రాథోడ్

4. ఆదిలాబాద్ - పాయల్ శంకర్

5. బోధ్(ఎస్టీ) - సోయం బాబు రావు (ఎంపీ)

6. నిర్మల్ - ఆలేటి మహేశ్వర్ రెడ్డి

7. ముదోల్ - రామారావు పటేల్

8. ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి

9. జుక్కల్ (ఎస్సీ) - టీ. అరుణ తార

10. కామారెడ్డి - కే. వెంకట రమణారెడ్డి

11. నిజామాబాద్ అర్బన్ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

12. బాల్కొండ - అన్నపూర్ణమ్మ ఆలేటి

13. కోరుట్ల - ధర్మపురి అరవింద్ (ఎంపీ)

14. జగిత్యాల - డా బోగా శ్రావణి

15. ధర్మపురి (ఎస్సీ) - ఎస్ కుమార్

16. రామగుండం - కందుల సంధ్యారాణి

17. కరీంగనర్ - బండి సంజయ్ (ఎంపీ)

18. చొప్పదండి (ఎస్సీ) - బొడిగే శోభ

19. సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి

20. మానకొండూర్ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్

21. హుజురాబాద్ - ఈటెల రాజేందర్

22. నార్సాపూర్ - ఎర్రగొళ్ల మురళీ యాదవ్

23. పఠాన్‌చెరు - టీ.నందీశ్వర్ గౌడ్

24. దుబ్బాక - రఘనందన్ రావు

25. గజ్వేల్ - ఈటెల రాజేందర్

26. కుత్భుల్లాపూర్ - కునా శ్రీశైలం గౌడ్

27. ఇబ్రహింపట్నం - నోముల దయానంద్ గౌడ్

28. మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

29. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

30. కార్వాన్ - అమర్ సింగ్

31. గోషామహల్ - టీ రాజాసింగ్

32. చార్మినార్ - మేఘా రాణి

33. చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్

34. యాకత్పురా - వీరేంద్ర యాదవ్

35. బహ్దుర్‌పురా - వై. నరేష్ కుమార్

36. కల్వకుర్తి - తల్లోజు ఆచార్య

37. కొల్లాపూర్ - అల్లెని సుధాకర్ రావు

38. నాగార్జున సాగర్ - కంకణాల నవనీత రెడ్డి

39. సూర్యపేట - సంకినేని వెంకటేశ్వర్ రావు

40. బోనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

41. తుంగతుర్తి (ఎస్సీ) - కడియం రామచంద్రయ్య

42. జనగామ - డా.దశ్మంత్ రెడ్డి

43. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) - డా.గుండె విజయ రామారావు

44. పాలకుర్తి - లేగా రామ్మోహన్ రెడ్డి

45. డోర్నకల్ (ఎస్టీ) - భుక్యా సంగీత

46. మహబుబాబాద్(ఎస్టీ) - జాతోత్ హుసేన్ నాయక్

47. వరంగల్ పశ్చిమ - రావు పద్మ

48. వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు

49. వర్ధన్నపేట (ఎస్సీ) - కొండేటి శ్రీధర్

50. భూపాలపల్లి - చందుపట్ల కీర్తి రెడ్డి

51. ఇల్లందు (ఎస్టీ) - రవీంద్ర నాయక్

52. భద్రాచలం (ఎస్టీ) - కుంజా ధర్మారావు

Updated : 22 Oct 2023 7:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top