బండి, కవిత ఆత్మీయ పలకరింపు.. నిజామాబాద్లో ఆసక్తికర సన్నివేశం..
Mic Tv Desk | 31 May 2023 5:20 PM IST
X
X
నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్‌కు హాజరైన బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఒకరినొకరు పలకరించుకున్నారు. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో ఉప్పూ నిప్పులా ఉండే నేతలు ఒకరినొకరు పలకరించుకోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. నేతల విమర్శలు రాజకీయపరమైనవేననీ.. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు ఉండే అవకాశం లేదని ఈ ఘటనతో నిరూపితమైందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
నిజామాబాద్‌లో భాజపా నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత సైతం రాగా, ఇద్దరు ఎదురుకావడంతో పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్ విఠాల్ రావును కవితబండి సంజయ్‌కు పరిచయం చేశారు.
Updated : 31 May 2023 5:20 PM IST
Tags: telangana nizamabad bjp state chief bandi sanjay mlc kavitha function baswa narsaiah house warming ceremony mla ganesh guptha
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire