Home > తెలంగాణ > బండి, కవిత ఆత్మీయ పలకరింపు.. నిజామాబాద్లో ఆసక్తికర సన్నివేశం..

బండి, కవిత ఆత్మీయ పలకరింపు.. నిజామాబాద్లో ఆసక్తికర సన్నివేశం..

బండి, కవిత ఆత్మీయ పలకరింపు.. నిజామాబాద్లో ఆసక్తికర సన్నివేశం..
X

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్‌కు హాజరైన బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఒకరినొకరు పలకరించుకున్నారు. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో ఉప్పూ నిప్పులా ఉండే నేతలు ఒకరినొకరు పలకరించుకోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. నేతల విమర్శలు రాజకీయపరమైనవేననీ.. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు ఉండే అవకాశం లేదని ఈ ఘటనతో నిరూపితమైందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

నిజామాబాద్‌లో భాజపా నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి బండి సంజయ్‌ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత సైతం రాగా, ఇద్దరు ఎదురుకావడంతో పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ విఠాల్‌ రావును కవితబండి సంజయ్‌కు పరిచయం చేశారు.

https://www.youtube.com/watch?v=DKBrdveYHVY&feature=youtu.be


Updated : 31 May 2023 6:55 PM IST
Tags:    
Next Story
Share it
Top