Home > తెలంగాణ > బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడి కిడ్నాప్ కలకలం

బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడి కిడ్నాప్ కలకలం

బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడి కిడ్నాప్ కలకలం
X

హైదరాబాద్ అల్వాల్‌లో(Alwal) బీజేపీ నేత‌ కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి రెడ్డి(Tirupathi Reddy) కిడ్నాప్ కు గురయ్యారు. ఈ మేర‌కు తిరుపతి రెడ్డి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి విషయంలో ప్రత్యర్థులతో ఆయనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం(MRO Office) సమీపంలో ఆయనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తహసీల్దార్ కార్యలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. ప్రత్యర్థులే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి స్వ‌స్థ‌లం జనగామ జిల్లా దుబ్బకుంటపల్లి. జ‌న‌గామ టికెట్ రేసులో ఉన్న తిరుపతి రెడ్డి.. రాజ‌కీయాల‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఉన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం హైదరాబాద్ కుషాయిగూడలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

భార్య సుజాత చేసిన ఫిర్యాదు మేరకు... తిరుపతిరెడ్డి కిడ్నాప్ వెనుక భూమి వివాదం కారణమని తెలుస్తోంది. 5929 గజాల భూమి విషయంలో ప్రత్యర్ధులే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని ఆమె తెలిపింది. మామిడి జనార్థన్ అనే వ్యక్తిపై తిరుపతిరెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా జనార్థన్ రెడ్డికి, తిరుపతిరెడ్డికి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుపతిరెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని మామిడి జనార్థన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్‌ పార్టీలో పని చేసిన తిరుపతిరెడ్డి.. కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో క్రియాశీల నేతగా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.





Updated : 14 July 2023 2:12 PM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top