BJP-JANASENA: తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జనసేన..!
X
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. షెడ్యూల్ విడుదలవడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. పొత్తులు, సీట్ల ప్రకటనపై బీజేపీ కసరత్తు చేస్తోంది. కమలం పార్టీ ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రచారం జరిగినా.. జనసేనతో పొత్తు అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను కలిశారు.
ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి.. పవన్తో సమావేశమై తెలంగాణలో పొత్తుపై చర్చించారు. ఉమ్మడిగా పోటీ చేద్దామని కిషన్ రెడ్డి పవన్కు సూచించారు. ఈ సందర్భంగా వారితో జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సూచనతో గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని.. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో పోటీచేయకుంటే క్యాడర్ స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్నారని పవన్ వారితో చెప్పారు. ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.