కేసీఆర్ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలా మార్చేసిండు - కిషన్ రెడ్డి
X
సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలా మార్చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇస్తేనే సాధ్యమవుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ నగరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ 9ఏండ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కిషన్ రెడ్డి చెప్పారు. తన హయాంలో మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో దేశంలో తీవ్రవాద దాడులు జరిగేవని, ఇప్పుడు అలాంటివేమీ జరగడంలేదని చెప్పారు.
bjp state president kishan reddy slams cm kcr for selling government lands
telangana,cm kcr,real estate company,brs,atm,kishan reddy,bjp state president,brs leaders,liquor,business,pm modi,holiday,corruption