Home > తెలంగాణ > అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి.. ప్రభుత్వంపై ఫైర్..

అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి.. ప్రభుత్వంపై ఫైర్..

అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి.. ప్రభుత్వంపై ఫైర్..
X

నాంపల్లి బజార్ఘాట్‌లో అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జంట నగరాల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ను పరిశీలించిన అనంతరం కిషన్ మీడియాతో మాట్లాడారు. జనావాసాల్లో వ్యాపార సముదాయాలు నిర్వహించకుండా చూడాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు.

అగ్నిప్రమాదాల నివారణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజావాసాల్లో అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వ్యాపార సముదాయాలను ఇప్పటికైనా నగరం బయటకు తరలించేలా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated : 13 Nov 2023 1:38 PM IST
Tags:    
Next Story
Share it
Top