Home > తెలంగాణ > కాళేశ్వరం భవిష్యత్తు ప్రమాదంలో పడింది - కిషన్ రెడ్డి

కాళేశ్వరం భవిష్యత్తు ప్రమాదంలో పడింది - కిషన్ రెడ్డి

కాళేశ్వరం భవిష్యత్తు ప్రమాదంలో పడింది - కిషన్ రెడ్డి
X

కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రమాదంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులతో కలిపి ఆయన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వారు మేడిగడ్డకు చేరుకున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని అన్నారు.

కాళేశ్వరం ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద అని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా మాట్లాడకూడదన్న ఉద్దేశంతోనే మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వచ్చామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 4 Nov 2023 7:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top