Home > తెలంగాణ > బీజేపీ బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

బీజేపీ బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

బీజేపీ బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. మరికొన్ని నెలలు మాత్రమే ఉండటంతో ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు ప్లాన్ సిద్దం చేసింది. సెప్టెంబర్ 17 నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అక్టోబర్ 2న యాత్ర ముగించేలా ప్రణాళికలు రూపొందించారు.

ఉమ్మడి 10 జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి యాత్ర నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఒక్కో క్లస్టర్ బాధ్యతల్ని కీలక నేతకు అప్పగించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ బస్సు యాత్రకు సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం అధికార బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ రివర్సైంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించిన హైకమాండ్ ఆ బాధ్యతల్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో తిరిగి జోష్ నింపేందుకు బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

bjp to planning for bus yatra from september 17

telangana,bjp,bus yatra,praja sangrama yatra,september 17,october 2,10 districts,brs,kishan reddy,bandi sanjay,etala rajender,party workers,bjp high command

Updated : 15 Aug 2023 9:08 PM IST
Tags:    
Next Story
Share it
Top