కాంగ్రెస్లోకి డీకే అరుణ.. క్లారిటీ ఇదిగో..!
X
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్టీ మారుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పార్టీ మారాలని డీకే అరుణపై కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ మారితే కాంగ్రెస్లో చేరాలని అనుచరులు ఆమెకు సూచించినట్లు సమాచారం. గద్వాల్లో మైనార్టీ ఓటు బ్యాంక్ భారీగా ఉండగా.. బీజేపీ నుంచి పోటీచేస్తే మైనస్ అవుతుందని ఆమెకు సన్నిహితులు హితబోధ చేస్తున్నారట. అందుకే ఆమె సొంతగూటికి చేరే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదంతా దుష్ర్పచారమే..
కాగా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై డీకే అరుణ స్పందించారు. అవన్నీ అసత్యాలని.. కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తేల్చిచెప్పారు. బీజేపీ తనపై నమ్మకంతో జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని.. అలాంటి పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు.