Home > తెలంగాణ > బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
X

బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఛలో మేడిగడ్డ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మేడిగడ్డ వేళుతున్న బీఆర్‌ఎస్ నాయకుల వాహనాలను వరంగల్ దేవన్న పేట్ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని చెబుతూ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు బయల్దేరారు. మొదటగా తెలంగాణ భవన్ చేరుకున్న నేతలు అక్కడ అల్పాహారం సేవించి బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు.

మాజీ సీఎం కేసీఆర్‌ మినహా మిగతా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బ్యారేజీ పరిశీలించనున్నారు.మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే... ఈ “చలో మేడిగడ్డ” అంటూబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ..బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే.. ఈ “చలో మేడిగడ్డ” అని పేర్కొన్నారు. “చలో మేడిగడ్డ” నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. ఈ “చలో మేడిగడ్డ” అన్నారు కేటీఆర్.

Updated : 1 March 2024 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top