Home > తెలంగాణ > Sohel case update: సినిమా లెవల్లో బిగ్ ట్విస్ట్.. సోహెల్ కేసులో సీఐ, ఎస్సైల పాత్ర..!

Sohel case update: సినిమా లెవల్లో బిగ్ ట్విస్ట్.. సోహెల్ కేసులో సీఐ, ఎస్సైల పాత్ర..!

Sohel case update: సినిమా లెవల్లో బిగ్ ట్విస్ట్.. సోహెల్ కేసులో సీఐ, ఎస్సైల పాత్ర..!
X

ప్రజాభవన్‌ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ఈ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెలే కారు యాక్సిడెంట్ కు కారణమని నిర్ధారణ అయింది. డిసెంబర్ 24వ తేదీ తెల్లవారుజామున 2:45 గంటలకు మద్యం మత్తులో ఉన్న సోహెల్.. తన బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777)తో ప్రజాభవన్ వద్ద ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఘటనా స్థలంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ విజయకాంత్ వారిపై ఎంవీ యాక్ట్ సెక్షన్ 184, ఐపీసీ 279 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నుంచి సోహెల్ ను తప్పించేందుకు.. పోలీసులు హై డ్రామా చేశారు. కారును నడిపింది వాళ్ల దగ్గర పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ అని తప్పుడు సాక్ష్యం సృష్టించారు. అతనిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి పంజాగుట్ట పీఎస్ కు తరలించినట్లు తెలుస్తుంది. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరులు.. స్టేషన్ కు వచ్చి సోహెల్ ను విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

కేసులో సీఐ పాత్ర:

దీనినై డీసీపీ విజయ్ అంతర్గత విచారణ జరిపించగా అసలు విషయం బయట పడింది. దాంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సోహెల్ దుబాయ్ కి పారిపోయాడు. ఈ నేపథ్యంలో అతనిపై లుకౌట్ నోట్ జారీ చేసిన పోలీసులు.. ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మరొకరి పేరు ఎవరు చేర్చారు? నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరు? అనే దానిపై విచారణ జరుగుతోంది. అతనికి సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావుకు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అయన అస్వస్థకు గురయ్యారు. కాగా మిగిలిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కారులో ప్రయాణించిన సోహెల్ స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సొహెల్​పై కేసులు:

ఇదిలా, ఉండగా డీసీపీ విజయ్ ​జరిపిన విచారణలో ప్రమాదంలో సొహెల్ ​పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ప్రమాదం తర్వాత సొహెల్ ​దుబాయ్‌లో ఉన్న తండ్రి షకీల్ వద్దకు వెళ్లినట్టు సమాచారం. అక్కడి నుంచే ఫోన్ల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తుంది. సొహెల్​ కోసం గాలింపు జరిపినపుడు ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులు అతనిపై లుక్​ ఔట్​ నోటీస్​ కూడా జారీ చేసినట్టుగా తెలియవచ్చింది. ఇది కాక మద్యం తాగి కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణం అయిన సోహెల్ పై ఎంవీ యాక్ట్ సెక్షన్ 184, ఐపీసీ 279 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.


Updated : 26 Dec 2023 4:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top