Professor Saibaba : ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హై కోర్టు
X
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను గతంలో అరెస్ట్ చేశారు. అంతేగాక ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్య పుస్తకాలు దొరికాయని పోలీసులు ఆరోపించారు. దీంతో గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరచగా..2017లో ఆయనను దోషిగా తేల్చి జైలుకు నిర్థారించి జీవిత ఖైదు విధించింది.
అనారోగ్యంతో వీల్ చెయిర్ కే పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్ పూర్ జైలులో ఉన్నారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపి సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేపారేసి 2022 అక్టోబర్ 14న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని సూచించగా..తాజాగా విచారణ అనంతరం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది.