Home > తెలంగాణ > మోడీ వేయించిన రోడ్ల వల్లే భూముల రేట్లు పెరిగాయి - బూర నర్సయ్య

మోడీ వేయించిన రోడ్ల వల్లే భూముల రేట్లు పెరిగాయి - బూర నర్సయ్య

మోడీ వేయించిన రోడ్ల వల్లే భూముల రేట్లు పెరిగాయి - బూర నర్సయ్య
X

కాంగ్రెస్ ప్రభుత్వం 30 రోజుల్లో సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారెంటీలపై వారికే గ్యారెంటీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చెమటోడ్చి చేసింది 6.32 లక్షల కోట్లు అప్పుని సటైర్ వేశారు. తెలంగాణకి కేంద్రం రూ. 9.36 లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేతల్లో గెలిచిన ఆనందం కనిపించడం లేదని.. వాళ్ళది అప్పుల చిప్ప అయితే తమది అక్షయ పాత్ర అని బూర సటైర్ వేశారు.

ప్రధాని మోడీ వేయించిన రోడ్ల వల్లే రాష్ట్రంలో భూములకు రేట్లు పెరిగాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా కేసీఆర్ సర్కారు నిర్మించలేదని విమర్శించారు. మోడీ జెన్ కో, ట్రాన్స్కోకు రూ. 80 వేల కోట్ల అప్పు ఇస్తే కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులేనందుకే సీఎం రేవంత్ కళ్లలో ఆనందం కనిపించడంలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

Updated : 1 Jan 2024 3:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top